Home » Reviews » Movie Reviews » వెంకీ మామ రివ్యూ…

News timeline

Movie Reviews
1 month ago

ప్రతిరోజు పండగే రివ్యూ…

Movie Reviews
1 month ago

వెంకీ మామ రివ్యూ…

Movie Reviews
2 months ago

అర్జున్ సురవరం రివ్యూ…

General news
7 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
7 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
7 months ago

Mallesham Movie Review and Rating

Teasers
7 months ago

Saaho Official Teaser

Movie Reviews
9 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
10 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
10 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
10 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
10 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
10 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
10 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
10 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
10 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
10 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
10 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
10 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
10 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
10 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
10 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
10 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
10 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
10 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
10 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
10 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
10 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
10 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
10 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

వెంకీ మామ రివ్యూ…

Movie Name: Venky Mama
Genre(s): Action, Comedy, Drama
Star Cast: Venkatesh, Naga Chaitanya, Raashi Khanna, Payal Rajput
Producer: Suresh Babu
Direction: K. S. Ravindra(Bobby)
Music: Thaman S
DOP: Prasad Murella
Editing: Prawin Pudi
Run Time: 2 hrs 29 Mins
Hitting the Big Screens on: Dec 13, 2019.

విక్టరీ వెంకటేష్‌, యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా మరియు మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు. కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం సమకూర్చారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ నిర్మాతలు. రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు రీల్‌ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్‌ ఏర్పడింది. మరి ఆ అంచనాలను వెంకీ మామ అందుకున్నాడా లేదా అన్నది ఇపుడు చూదాం…

కథ – కథనం :

జాతకం చెప్పడంలో సిద్దహస్తులైన రామ్ నారాయణ (నాజర్) కొడుకు వెంకటరత్నం (వెంకటేష్).. తన తండ్రిని ఎదురించి అక్కకు పెళ్లిచేస్తాడు. జాతకాలు కలవలేదు పెళ్లి వద్దు, బిడ్డ పుట్టిన ఏడాదికే తల్లిదండ్రులు చనిపోతారని జాతకం చెబుతుందని వాదించిన తండ్రి మాట వినకుండా పెళ్లి చేస్తాడు. దీంతో ఆ జాతకమే నిజమై కార్తీక్ (నాగ చైతన్య) పుట్టిన ఏడాదికి తల్లిదండ్రులు మరణిస్తారు. అలాంటి జాతకాలున్నవారికి పుట్టిన వాడికి అలానే ఉంటుందని, వాడిని అనాథలా వదిలేయండని చెబుతాడు. అయితే జాతకాలను మార్చే శక్తి మనిషి ప్రేమకుందని నమ్మే వెంకటరత్నం తన మేనల్లుడిని పెంచుకుంటాడు.

అమ్మ నాన్న లేని తన అల్లుడిని ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుతాడు. తాను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి తన అల్లుడ్ని సరిగ్గా చూసుకోదని పెళ్లి చేసుకోవటమే మానేస్తాడు. అల్లుడు కార్తిక్‌ శివరామ్‌ (నాగ చైతన్య)కు కూడా మేనమామే ప్రపంచంగా బతికేస్తుంటాడు. లండన్‌లో ఉద్యోగం వచ్చినా మామయ్యకు దూరంగా వెళ్లడం ఇష్టం లేక ఆ ఉద్యోగాన్ని వదిలేసుకుంటాడు. అదే సమయంలో తమ ఊరికి వచ్చిన హిందీ టీచర్‌ వెన్నెల (పాయల్‌ రాజ్‌పుత్‌)తో వెంకటరత్నం, క్లాస్‌మెట్‌ హారిక(రాశీఖన్నా) తో కార్తిక్‌ ప్రేమలో పడతారు. అంతా ఆనందంగా ఉందనుకున్న సమయంలో కార్తీక్‌, వెంకటరత్నంలు విడిపోవాల్సి వస్తుంది. ఒకరికొకరు ప్రాణంగా కలిసుండే మామా అల్లుళ్లు విడిపోవడానికి కారణం ఏంటి..? కార్తీక్‌ జాతకం వెనుకున్న రహస్యం ఏంటి? గోదావరి జిల్లాల్లో మామతో కలిసి అల్లరి చేసే కార్తిక్‌ సైన్యంలోకి ఎందుకు వెళ్లాడు..? ఎమ్మెల్యే పశుపతి నాయుడు (రావు రమేష్), బ్రిగేడియర్ విజయ్ ప్రకాశ్ ( ప్రకాశ్ రాజ్)లకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? మామా అల్లుళ్లు తిరిగి ఎలా కలిశారు..? అనే ప్రశ్నలకు సమాధానమే వెంకీమామ మిగతా కథ.

నటన:

వెంకీ, చైతూలు ఇద్దరు తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి. ముఖ్యంగా తెర మీద వీరిద్దరి కాంబినేషన్‌ బాగుంది అనిపించేలా ఉంది. వెంకటేష్ తన పాత్రకు తగ్గట్లు… తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. చైతూ కాస్త తడబడినా తన పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్లు పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నాలు గ్లామర్‌ కోసం తప్ప.. నటనకు పెద్దగా ఆస్కారం లేని పాత్రలు అని చెప్పాలి. ఇతర పాత్రల్లో నాజర్‌, ప్రకాష్‌ రాజ్‌, రావూ రమేష్‌, దాసరి అరుణ్‌, హైపర్‌ ఆది, విద్యుల్లేఖ రామన్‌ తదితరులు పరవాలేదనిపించారు.

టెక్నికల్‌:

సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఆసక్తికరంగా సాగని కొన్ని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే, బాగుండేది… సినిమాటోగ్రఫీ విలేజ్ సన్నివేశాల్లోని విజువల్స్ ను చాలా సహజంగా చూపించారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు అని చెప్పాలి. కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వం సినిమాను ఎంటర్ టైన్ గా తీయడం లో విఫలమయ్యాడు… కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అవ్వడం, సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ సీక్వెన్స్ స్ లో వచ్చే సీన్స్ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్ గా అనిపిస్తుంది…

ప్లస్ పాయింట్స్ :

*వెంకీ నటన
*మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

*కథ
*కథనం
*కామెడీ
*బోర్ కొట్టే సీన్లు
*సాగదీసే సన్నివేశాలు
*క్లైమాక్స్

చివ‌రిగా : వెంకీ మామ… సినిమా బోరింగ్ మామ…

MovieRecharge Rating: 3.6/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *