Home » General news » వివేకానంద రెడ్డి ది హత్యే ,నిర్దారించిన పోలీసులు : విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు

News timeline

Teasers
6 days ago

Saaho Official Teaser

Movie Reviews
2 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
3 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
3 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
3 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
3 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
3 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
3 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
3 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
3 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
3 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
3 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
3 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
3 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
3 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
3 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
3 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
3 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
3 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
3 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
3 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
3 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
3 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
3 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
3 months ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
3 months ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
3 months ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
3 months ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
3 months ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
3 months ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

వివేకానంద రెడ్డి ది హత్యే ,నిర్దారించిన పోలీసులు : విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు

వైఎస్ జగన్ చిన్నాన్న రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడైన వివేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం మరణించారు .. తొలుత అందరు ఆయన గుండె నొప్పి కారణం గా చనిపోయారనుకున్నారు .. కానీ ఇది సహజ మరణం కాదని హత్యేనని పోలీసులు నిర్దారించారు .. ఆయన శరీరంపై ఏడు గాయాలు ఉన్నట్టు స్పష్టంచేశారు. నుదిటిపై రెండు లోతైన గాయాలు, తల వెనుక భాగంలో మరో గాయం, ఛాతి, తొడ భాగంలోనూ గాయాలు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ .. ఈ హత్యకు సంబంధించి తాము కొన్ని ఆధారాలు సేకరించినట్టు చెప్పారు. ఘటనా స్థలంలో కొన్ని వేలిముద్రలు గుర్తించామని, అవి ఎవరివో తేల్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తుందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టంచేశారు. ఈ కేసు విచారించి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
అయితే ఈ తన చిన్నాన్న హత్య పై స్పందించిన జగన్, తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. సౌమ్యుడైన తన బాబాయిని ఇంట్లోకి చొరబడి గొడ్డలితో దారుణంగా ఐదుసార్లు నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అత్యంత హేయమైనదిగా జగన్‌ అభివర్ణించారు. వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు. బెడ్‌రూంలో హత్య చేసి బాత్‌రూంకు తీసుకెళ్లారన్నారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని చెప్పారు. వివేకా లేఖ రాశారని చెబుతున్నారని.. అదంతా కట్టుకథే అన్నారు. ఈ హత్యోదంతంపై సీబీఐ విచారణ జరిపించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ బృందం దర్యాప్తు చేస్తున్న తీరు చూస్తుంటే తనకు బాధేస్తోందన్నారు. వివేకా సహజంగా చనిపోయినట్లుగా చూపించేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్నారంటూ పోలీసులు ఓ లేఖ చూపుతున్నారని.. డ్రైవర్‌పై నెపం నెట్టేందుకే లేఖను సృష్టించారని జగన్‌ ఆరోపించారు. ‘‘తన తాత రాజారెడ్డి, తన తండ్రి రాజశేఖర్‌రెడ్డిని కుట్ర చేసి చంపారు. రాజశేఖర్‌రెడ్డి మృతిపై ఇప్పటికీ మాకు అనుమానంగానే ఉంది. అత్యంత భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలోనూ నాపై హత్యాయత్నం జరిగింది. నాపై హత్యాయత్నం జరిగితే కోడికత్తి దాడి అంటూ వెటకారం ఆడారు. ఈ మూడు ఘటనల్లోనూ చంద్రబాబు కుట్ర కనిపిస్తోంది. మా తండ్రి మరణం ప్రమాదమని పేర్కొంటూ అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ స్టేట్‌ మెంట్ ఇచ్చారు. వాళ్లే హత్య చేసి.. వాళ్లే సిట్‌ వేస్తే న్యాయమెలా జరుగుతుంది. రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు. అదనపు డీజీ వెంకటేశ్వరరావు నా కళ్ల ముందే ఎస్పీకి ఫోన్లు చేశారు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. అన్యాయం చేసిన వారికి దేవుడే గుణపాఠం చెబుతాడు. ఈ విషయంలో వైకాపా శ్రేణులు సంయమనం పాటించాలి’’ అని జగన్‌ విజ్ఞప్తి చేశారు.
వివేకానంద రెడ్డి మృతి పట్ల అనుమానాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకానందరెడ్డి మృతిపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని సూచించారు. దోషుల్ని వెంటనే అరెస్టు చేసి, నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని సీఎం అధికారులను సూచించారు. వివేకానంద రెడ్డి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేయడంపై అప్పటికప్పుడు డీజీపీ, ఇంటెలిజెన్స్‌, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *