దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర .. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 8న విడుదలకి సిద్ధమైంది .. మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు .. అయితే యాత్ర ప్రీమియర్ షో ఫస్ట్ టికెట్ ను అమెరికాలో వేలం వేసారు. మునీశ్వర్ రెడ్డి అనే వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి అభిమాని యాత్ర ఫస్ట్ టికెట్ ను 6,116 డాలర్లకు (4.37 లక్షల) కొన్నాడు.
ఇక ఈ సినిమాలో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.