ఇండస్ట్రీ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతుంది.. మోడీ, ఎన్టీఆర్, వైఎస్సార్, మన్మోహన్ సింగ్ ఇలాంటి రాజకీయ నాయకుల బయోపిక్ ల తర్వాత మరో యువ నాయకుడి బయోపిక్ రాబోతుంది అదే రాహుల్ గాంధీ బయోపిక్.. ‘మై నేమ్ ఈజ్ రాగా’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపనున్నారు. దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్ కూడా అయిన రూపేష్ పాల్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ టీజర్ విడుదలయింది. ఇది ఒకవిధంగా రాహుల్ బయోపిక్ అనడం కన్నా రాజకీయంగా తనకు ఎదురైనా దాడులను, ఆటుపోట్లను ఎదుర్కొన్న ఓ వ్యక్తి కథ అని రూపేష్ పాల్ అంటున్నారు. ఓటమిని, వైఫల్యాలను నిర్భయంగా ఫేస్ చేసిన ఏ వ్యక్తి అయినా ఈ కథను తనకు అన్వయించుకోవచ్చునని ఆయన పేర్కొన్నాడు. ఇందులో రాహుల్ కుటుంబానికి చెందిన సభ్యుల పాత్రధారులను కూడా చూపడం విశేషం. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వచ్చే ఏప్రిల్ నెలలో ఈ బయో పిక్ విడుదల చేయాలనుకుంటున్నారు.