Home » General news » ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

News timeline

Movie News
7 hours ago

మునుపెన్నడూ చెయ్యని పాత్రలో నాగ చైతన్య

Movie Gossips
7 hours ago

త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ ఆసక్తికర అప్డేట్

Movie News
7 hours ago

మెగా స్టార్ చిరంజీవి బెయోపిక్, క్లారిటీ ఇచ్చిన నాగబాబు

Movie Gossips
7 hours ago

ఆర్‌‌ఆర్‌ఆర్ లో రామ్ చరణ్ పాత్ర ఇదేనట

Movie Gossips
7 hours ago

ఎలక్షన్ల తర్వాతే బాలయ్య బోయపాటి సినిమా

Movie News
8 hours ago

సుకుమార్ చేతిలో పడ్డ నిహారిక కొణిదెల

Movie News
2 days ago

ఉత్కంఠ భరితంగా కళ్యాణ్ రామ్ 118 ట్రైలర్

Politics
3 days ago

జగన్ ఎవరో నాకు తెలీదు : రామ్ గోపాల్ వర్మ

Movie News
3 days ago

మహానటి అవార్డుల పంట : ఏకంగా ఆరు

General news
4 days ago

వాళ్ళని వదలొద్దు చంపేయండి : టాలీవుడ్ ప్రముఖులు

General news
4 days ago

పుల్వామా ఘటనపై క్రికెటర్ల ఎమోషనల్ ట్వీట్లు

Teasers
4 days ago

చెవిటి వాడిగా వస్తున్న సూర్య

General news
4 days ago

నిజమే మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం : ఆర్య

Movie Gossips
4 days ago

ఛీ ఛీ తెలుగు ఇండస్ట్రీ ఉండేకొద్దీ బూతు ఇండస్ట్రీ గా మారిపోతుంది

Movie Gossips
5 days ago

సంచలం సృష్టిస్తున్న వర్మాస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

General news
5 days ago

యూట్యూబ్ లో వరుస సంచలనాలు సృష్టిస్తున్న రౌడీ బేబీ

Movie Reviews
5 days ago

లవర్స్ డే మూవీ రివ్యూ

Movie Reviews
5 days ago

దేవ్ తెలుగు మూవీ రివ్యూ

Movie Gossips
5 days ago

మహేష్ మహర్షి సెట్ లో కార్తీ

Teasers
6 days ago

MAJILI Movie Teaser

Movie News
6 days ago

ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసి రెడీ గా ఉండండి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నా : వర్మ

General news
6 days ago

చంద్రబాబు అంటే మహేష్ కి గౌరవమే కానీ ప్రచారం చెయ్యడు : నమ్రత

Movie News
6 days ago

నరేంద్ర మోడీ బయోపిక్ లో అమిత్ షా లుక్

Movie Gossips
6 days ago

బాలయ్యకి టార్గెట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ

Movie News
7 days ago

118 మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

Movie News
7 days ago

సైరా లో అల్లు అర్జున్ కన్ఫార్మ్

Movie News
7 days ago

మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

General news
7 days ago

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

Movie News
7 days ago

యాత్ర టీమ్ కి కృతఙ్ఞతలు తెలిపిన వైయస్ విజయమ్మ

Movie News
1 week ago

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో ఇంట్రెస్టింగ్ రోల్ లో అజయ్ దేవగన్ ?

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూశారు. అనారోగ్య కారణంతో ఆయన ఈ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. చిత్రపరిశ్రమలో విజయబాపినీడుగా సుపరిచితమైన ఆయన 1936 సెప్టెంబర్‌ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు. ఏలూరులోని సీఆర్‌ఆర్‌ కళాశాలలో బీఏ వరకు చదివి కొంతకాలం వైద్యారోగ్య శాఖలో పనిచేశారు. గుత్తా బాపినీడు పేరుతో పలు రచనలు చేశారు. మద్రాస్‌లో బొమ్మరిల్లు, విజయ పత్రికలను సంపాదకుడిగా ఆయన వ్యవహరించారు. కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలు జడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశారు. గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయ బాపినీడు భౌతిక కాయానికి చిరంజీవి నివాళులర్పించారు. బాపినీడు ఇకలేరన్న సమాచారం అందుకున్న చిరంజీవి బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. బాపినీడు మరణం తననెంతగానో కలచివేసిందని చిరంజీవి అన్నారు. సినీ నటుడు మంచు మోహన్‌బాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధించిందని తెలిపారు. ‘బాపినీడుతో నాకున్న పరిచయం నేటిది కాదు. 1990 నుంచి ఆయన నాకు బాగా తెలుసు. నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో బాపినీడు ఒకరు. ఎంతో మృదుస్వభావి. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. బాపినీడు మంచి దర్శకుడు మాత్రమే కాదు.. అంతకుమించిన మంచి రచయిత, సంపాదకుడు. అభిరుచి గల నిర్మాత. చాలా కష్టపడతారు. ఆయనలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *