హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పై చర్యలు తీసుకునేందుకు జిహెచ్ఎంసి సిద్ధమైంది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న.. సినీనటుడు తారకరత్నకు చెందిన కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను కూల్చడానికి ప్రయత్నం చేయగా.. డ్రైవ్ఇన్ రెస్టారెంట్ నిర్వాహకులు, జీహెచ్ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమాచారం అందుకున్న తారకరత్న డ్రైవ్ ఇన్ వద్దకు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్‌ను నడుపుతున్నారని, రెసిడెన్షియల్ ఏరియాలో రాత్రి వేళల్లో మద్యం తాగుతూ, డీజే సౌండ్స్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని, అక్కడి కాలనీలోని సొసైటీ సభ్యుల నుండి తమకు ఫిర్యాదులు రావడంతో కూల్చడానికి వచ్చామని అధికారులు చెబుతున్నారు. దీంతో తనకు కొంత సమయం ఇవ్వాలని తారకరత్న కోరగా, అందుకు ఓకే చెప్పిన జీహెచ్ఎంసీ అధికారులు సాయంత్రం వరకు సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది.