Home » Reviews » Movie Reviews » అర్జున్ సురవరం రివ్యూ…

News timeline

Movie Reviews
1 month ago

ప్రతిరోజు పండగే రివ్యూ…

Movie Reviews
1 month ago

వెంకీ మామ రివ్యూ…

Movie Reviews
2 months ago

అర్జున్ సురవరం రివ్యూ…

General news
7 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
7 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
7 months ago

Mallesham Movie Review and Rating

Teasers
7 months ago

Saaho Official Teaser

Movie Reviews
9 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
10 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
10 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
10 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
10 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
10 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
10 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
10 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
10 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
10 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
10 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
10 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
10 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
10 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
10 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
10 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
10 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
10 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
10 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
10 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
10 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
10 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
10 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

అర్జున్ సురవరం రివ్యూ…

Movie Name: Arjun Suravaram
Genre(s): Crime, Thriller
Star Cast: Nikhil Siddharth, Lavanya Tripathi, Vennela Kishore, Krishna Murali Posani
Producer: Rajkumar Akella, Madhu B.
Direction: T.N. Santhosh
Music: Sam C.S.
DOP: Suryaa
Editing: Naveen Nooli
Run Time: 2 hrs 29 Mins
Hitting the Big Screens on: Nov 29, 2019.

నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా పడుతూ లేస్తూ ఎట్టకేలకు నేడు (నవంబర్ 29) విడుదలకు నోచుకుంది. తమిళ సూపర్‌ హిట్ కనితన్‌ను తెలుగులో ‘అర్జున్ సురవరం’గా రీమేక్‌ చేశారు. మొదట్లో ‘ముద్ర’ అనే టైటిల్‌‌తో ప్రచారం కల్పించి ఆ తరువాత అనేక వివాదాలు వాయిదాల అనంతరం మెగాస్టార్ బ్లెస్సింగ్‌తో ‘అర్జున్ సురవరం’ విడుదలైంది.

‘‘ఒక మహానుభావుడు చెప్పాడు.. కొన్ని సార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా. దీపావళి సందర్భంగా చెప్తున్నా.. చీకటి తెరలను చీల్చుకుంటూ వెలుగులోకి నా సినిమా వచ్చే సమయం వచ్చింది. ప్రియమైన మిత్రులారా.. ‘అర్జున్ సురవరం’ 2019 నవంబర్ 29న విడుదలవుతోందని అందరికీ చెప్పండి. స్పష్టత కోసం సంవత్సరం కూడా చెప్పా’’ అంటూ ఇయర్ చెప్పి మరీ సినిమా రిలీజ్ డేట్‌ను నిఖిల్ ప్రకటించాడంటే విడుదలపై ప్రేక్షకులకే కాదు.. అతనికి కూడా ఎక్కడో ఒకచోట అపనమ్మకం. ఎందుకంటే రిలీజ్ డేట్ ప్రకటించడం మళ్లీ వెనక్కి తగ్గడం. ఇలా ఆరునెలల కాలంలో చాలా మార్లు వాయిదా పడుతూ వచ్చింది అర్జున్ సురవరం.

ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పోసాని కృష్ణముర‌ళి, సత్య, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టు‌గా కనిపించారు. లావణ్య త్రిపాఠి రిపోర్టర్‌గా కనిపించిoది.

సినిమా కథా కథనాలు కూడా ఆసక్తికలిగిస్తున్నాయి. ప్రస్తుతం విద్యార్థుల జీవితాలను ఇబ్బంది పెడుతున్న ఓ సమస్య మీద ఓ సామాన్యుడు చేసే పోరాటమే అర్జున్‌ సురవరం కథ.

కథ – కథనం :

జర్నలిస్ట్‌ అర్జున్‌ లెనిన్‌ సురవరం(నిఖిల్‌). ఈయన తన ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టింగ్‌తో సమాజంలో జరుగుతున్న పలు సంఘ విద్రోహక పనులను అడ్డుకుంటూ ఉంటాడు. అలా అర్జున్‌ సురవరం ఒక జాతీయ స్థాయి స్కామ్‌ గురించి తెలుసుకుని దాన్ని లోతుగా ఇన్వెస్టిగేషన్‌ చేసేందుకు సిద్దం అవుతాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. అతడిని పోలీసులు మరియు జనాలు అపార్థం చేసుకుంటారు. ఇంతకు ఆ పెద్ద స్కామ్‌ ఏంటీ? పోలీసు కేసుల నుండి ఎలా బయట పడ్డాడు అనేది సినిమా కథ.

నటన:

నిఖిల్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది. చాలా కాలం పాటు ఈ సినిమాను చేశారు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ బాగున్నాయి. యాక్షన్‌ సీన్స్‌లో నిఖిల్‌ నటన బాగుంది. ఎమోషన్‌ సీన్స్‌లో నిఖిల్‌ నటనతో మెప్పించాడు. ఇక హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కనిపించింది తక్కువే. అయితే ఉన్నంతలో ఆమె మెప్పించింది. ఇక వెన్నెల కిషోర్‌ కామెడీతో మెప్పించాడు. సత్య కూడా నిఖిల్‌ స్నేహితుడి పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించారు

టెక్నికల్‌:

ఈ సినిమాలోని పాటల గురించి పెద్దగా పట్టించుకునే అవకాశమే లేదు. పాటల చిత్రీకరణ కూడా సో సో గానే ఉంది. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది. కొన్ని సీన్స్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఎక్కడికో తీసుకు వెళ్లింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కొన్ని ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ మరియు చేజింగ్‌ సీన్స్‌లో సినిమాటోగ్రఫీ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్తుంది. ఇక ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు ఉన్నా పర్లేదు అనిపించింది. దర్శకుడు సంతోష్‌ కథను నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు. స్క్రీన్‌ప్లే ఆకట్టుకునే విధంగా నే ఉంది. నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

*కథ
*నిఖిల్‌ నటన
*సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

*బోర్ కొట్టే సీన్లు
*సాగదీసే సన్నివేశాలు

చివ‌రిగా : అర్జున్ సురవరం… ఒకసారి మాత్రమే…

MovieRecharge Rating: 5.6/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *